క్రిస్మస్ పండుగ వేళ తీవ్ర విషాదం…రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి
క్రిస్మస్ పండుగ వేళ సదాశివపేటలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి
దిశ, సదాశివపేట; క్రిస్మస్ పండుగ వేళ సదాశివపేటలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు వ్యక్తులు బైక్ నడుపుతూ ...వేర్వేరు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే... ఘటనకు సంబంధించి స్థానికుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలంలో చర్యలు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం… సదాశిపేట మండలంలోని మెలిగిరిపేట గ్రామానికి చెందిన ప్రకాష్(30) గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు...అందోల్ మండలం రామ్సన్ పల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ (35) స్తంభాన్ని ఢీకొని గుంతలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.