కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముఖ్యమంత్రిపై కేసు నమోదు

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు మరో అనూహ్య షాక్ తగిలింది. బీజేపీ నేత తేజిందర్ సింగ్ బగ్గా ముంబైలోని బలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో సీఎం ఠాక్రేపై ఫిర్యాదు చేశారు.

Update: 2022-06-23 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు మరో అనూహ్య షాక్ తగిలింది. బీజేపీ నేత తేజిందర్ సింగ్ బగ్గా ముంబైలోని బలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో సీఎం ఠాక్రేపై ఫిర్యాదు చేశారు. ''ముఖ్యమంత్రి ఠాక్రేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని బుధవారం సీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో ఏర్పడిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో అర్ధరాత్రి సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి తన సొంతింటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా అక్కడకు చేరుకొని ఆయన్ను కలిశారు. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన ముఖ్యమంత్రి ఐసోలేషన్‌లో ఉండాల్సింది పోయి.. కార్యకర్తలను కలిసి కరోనా నిబంధనలు ఉల్లంఘించాడు.'' అంటూ బీజేపీ తేజిందర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


Similar News