స్పీకర్ పోచారంకు తలనొప్పిగా మారిన బస్వాపూర్..

దిశ, కోటగిరి: అత్యధిక అభివృద్ధి - Villagers protest in Banswada constituency against allotment of double bedrooms to the ineligible

Update: 2022-04-06 10:10 GMT

దిశ, కోటగిరి: అత్యధిక అభివృద్ధి జరిగిన నియోజకవర్గాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదట ఉన్నా.. కొందరు నాయకుల చేష్టలు స్పీకర్‌కు తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో స్పీకర్ కృషితో సుమారు పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకొనిరాగా.. కొందరు అధికార పార్టీ నాయకులు మాత్రం నిర్మాణం పూర్తయిన కూడా.. వర్గపోరుతో రెండేళ్లుగా అధికారుల నిర్లక్ష్యంతో పంపిణీకి నోచుకోకపోవడంతో.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సోమవారం రాత్రి గ్రామస్తులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

వెనుదిరిగిన అధికార యంత్రాంగం..

అర్హులైన తమకు డబుల్ బెడ్ రూమ్ గత రెండేళ్లుగా ఇవ్వడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు రాత్రికి రాత్రే తాళాలు పగలగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారితో బుధువారం అధికార యంత్రాంగం సముదాయించి ఖాళీ చేయించాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యాయి. తమ ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండ్లను స్వాధీనం చేసుకున్న వారి పేర్లను రాసుకొని సర్వే చేసి అసలైన లబ్దిదారులకు ఇళ్లను కేటాయిస్తామని అధికార యంత్రాంగం వెనుదిరిగింది.

అనర్హులకు డబుల్ బెడ్రూం లు ఎలా ఇస్తారు..?


టీఆర్ఎస్ పార్టీ వర్గ పొరుతో గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఒక వర్గం వారు మాత్రమే ఎలా ఆక్రమిస్తారని మరో వర్గం వారు తహశీల్దార్ విఠల్ ను అడ్డుకున్నారు. ఆక్రమించిన వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని, పూర్తి విచారణ జరిపి నిజమైన అర్హులకే డబుల్ బెడ్రూం లు వచ్చేలా చూడాలని తహశీల్దార్ తో విన్నవించుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో అనర్హులకు డబుల్ బెడ్ రూమ్‌లు ఎలా కేటాహిస్తారు అంటు గ్రామస్తులు ధర్న చేశారు

Tags:    

Similar News