సినిమా మాదిరి టెక్నిక్‌: రైల్వే ట్రాక్‌కు ఎర్ర‌చీర చుట్టింది..!

ఓ మహిళ అప్రమత్తమై అలాంటి ప్ర‌మాదాన్ని త‌ప్పించింది. Woman's Quick Thinking Prevents Train Accident.

Update: 2022-04-05 12:34 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌ఖ్యాతి చెందింది ఇండియ‌న్ రైల్వేస్‌. ఇక్క‌డ‌, రోడ్డు ట్రాఫిక్‌కు రైళ్ల ట్రాఫిక్‌కు పెద్ద తేడా లేద‌న్న‌ట్లు ఉంటుంది ప‌రిస్థితి. అయితే, ఇలాంటి చోట రైలు ప్రమాదానికి గుర‌య్యిందంటే చాలా ప్రాణ న‌ష్టం, ఎంతో ఆస్తి నష్టానికి దారి తీస్తుంది. కానీ, ఓ మహిళ అప్రమత్తమై అలాంటి ప్ర‌మాదాన్ని త‌ప్పించింది. మ‌నం చాలా సినిమాల్లో ఎర్ర గుడ్డ‌ను చూపించి, రైలు ఆపిన సీన్లు చాలానే చూసుంటాము. ఈ మ‌హిళ కూడా స‌రిగ్గా ఇలాగే ఆలోచించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఓంవతి అనే గ్రామీణ మ‌హిళ రైలు ట్రాక్ ప‌క్క‌నే న‌డుచుకుంటూ ప‌నికి వెళుతున్న క్ర‌మంలో రైలు ట్రాక్ విరిగిపోయిన‌ట్లు గ‌మ‌నించింది. విరిగిన ఇటుగా రైలు వ‌స్తే ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని అనుకున్న‌ ఓంవతి, వెంటనే తన ఎరుపు రంగు చీరను తీసి, సమీపంలోని చెట్టు నుండి రెండు కర్రలను తెచ్చి, ట్రాక్‌కు రెండు వైపులా పెట్టి, త‌న ఎర్ర చీర‌ను రెండు క‌ర్ర‌ల‌కు త‌గిలించింది.

ఈ సంఘటన ఎటా జిల్లాలోని అవగర్ బ్లాక్‌లోని గులేరియా గ్రామ సమీపంలో జరిగింది. ఎటా నుండి తుండ్లాకు ఒక ప్యాసింజర్ రైలు వెళ్తోంది, అయితే డ్రైవర్ రెడ్ కలర్ క్లాత్‌ని గుర్తించి బ్రేకులు వేశాడు. ఆ తర్వాత ట్రాక్‌కు మరమ్మతులు చేసి, గంట తర్వాత రైలు బయలుదేరింది. ఒక పెద్ద ప్ర‌మాదాన్ని ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడిన ఓంవతి అధికారులు, స్థానికుల నుండి ప్రశంసలు అందుకుంది. గ‌త గురువారం జ‌రిగిన ఈ సంఘటనను సచిన్ కౌశిక్ అనే యుపి పోలీసు ట్విట్టర్‌లో పంచుకోగా, ఆమె బుద్దికుశ‌ల‌త‌కు నెటిజ‌న్లు సెల్యూట్ చేస్తున్నారు. 

Tags:    

Similar News