హార్ట్ ఎటాక్‌పై స్పందించిన విక్రమ్.. చనిపోయినా ఆందోళన లేదా!
దిశ, సినిమా : చియాన్ విక్రమ్ హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో చేరాడన్న న్యూస్ క్షణాల్లోనే వైరల్ అయింది..Latest Telugu News
దిశ, సినిమా : చియాన్ విక్రమ్ హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో చేరాడన్న న్యూస్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే అదే రోజు ఆయన కొడుకు ధృవ్ విక్రమ్.. నాన్న బాగున్నాడని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 'కోబ్రా' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో తొలిసారిగా కనిపించిన విక్రమ్.. ఈ ఇన్సిడెంట్‌పై రియాక్ట్ అయ్యాడు.
ముందుగా ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. రోగి శరీరానికి తన ముఖాన్ని జోడించి ఫొటో మార్ఫింగ్ చేసిన కొందరు దాన్ని థంబ్‌నెయిల్స్‌గా వాడి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపాడు. వారి క్రియేటివిటీ చాలా బాగుందని, జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న తనకు ఇదేమీ పెద్ద ఆందోళన కలిగించే విషయం కాదన్నాడు విక్రమ్. కానీ ఇలాంటి సమయంలోనూ స్నేహితులు, అభిమానుల మద్దతు చూసి ఆనందపడిపోయానని, ఇంతకు మించి ఏం కావాలని ఎమోషనల్ అయ్యాడు.