మంగళగిరిలో బీసీ నేత వెకిలి చేష్టలు.. చెప్పు దెబ్బలు కొట్టిన మహిళ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీ సంక్షేమ సంఘం నేత అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. వెనకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి పేరుతో బీసీ మహిళలను ఆర్థికంగా మోహం చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీ సంక్షేమ సంఘం నేత అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. వెనకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి పేరుతో బీసీ మహిళలను ఆర్థికంగా మోహం చేశాడు. తిరిగి డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారు. మరికొందరికి మాయమాటలు చెప్పి లక్షల్లో ఆర్థికసాయం తీసుకొని, అనంతరం బలహీనతను ఆసరా చేసుకుని లోబర్చుకోవటం, లోబడని వారిని లోబడినట్లుగా ప్రచారం చేశాడు. దీంతో చిర్రెత్తిన మహిళలు ఆవేదన, ఆక్రోషంతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పరసా రంగనాథ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఉదంతం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
మంగళగిరి పట్టణానికి చెందిన పరసా రంగనాథ్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం పేరుతో మంగళగిరి నియోజకవర్గంలోని బీసీ మహిళలను ఆర్థికంగా మోసం చేసినట్లు సమాచారం. దీంతో జిల్లా బాధ్యతల నుండి ఇటీవల రంగనాథ్‌ను తొలగించారు. అనంతరం మోసం చేసి తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగిన మహిళను మానసికంగా వేధింపులకు గురిచేయడంతో పోలీసులను అశ్రయించింది. దీంతో అతనిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా.. ఓ మహిళతో ఉన్న పరిచయంతో ఇంటికి వెళ్లిన బీసీ నేతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కుటుంబీకులు, బీసీ సంఘం మహిళలు దేహశుద్ధి చేశారు. రంగనాథ్‌ను మహిళ చితకబాదిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.