ఇదిగో... ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి వీడియో!
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసులు పెరుగుతుండడతో చైనాలో మళ్లీ లాక్ డౌన్ ను విధించిన..Video of Locked Down in Shanghai
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసులు పెరుగుతుండడతో చైనాలో మళ్లీ లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే, షాంఘైలో చైనా విధించిన కఠినమైన లాక్‌డౌన్ చర్యలు నగరవాసులకు, ముఖ్యంగా కుక్కల యజమానులకు జీవితాలను కష్టతరం చేశాయి. నగరంలోని 26 మిలియన్ల మంది నివాసితులలో ఎక్కువ మందిని ప్రభుత్వం తమ ఇళ్లను విడిచిపెట్టకుండా లాక్ డౌన్ చేసింది. నగరంలో లాక్‌డౌన్ విధించడంతో నివాసితులు ఎలా వ్యవహరిస్తున్నారు? అనేదానిపై అమెరికన్ పబ్లిక్ హెల్త్ సైంటిస్ట్ ఎరిక్ ఫీగల్-డింగ్ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. గ్రహం మీద అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ప్రస్తుతం జీవిన విధానం ఎలా ఉందో ఈ వీడియోలో చూడొచ్చు అని ఆయన పేర్కొన్నారు.
Behold… the abandoned streets of the most populace city on Earth, Shanghai, in the strictest pandemic lockdown the world has ever seen. Normally these streets are shoulder-to-shoulder crowded. Eeerie. pic.twitter.com/HGdvK6NLOD
— Eric Feigl-Ding (@DrEricDing) April 1, 2022