stress balls: స్ట్రెస్ బాల్స్ వినియోగం.. శరీరంలో జరిగే మార్పులివే?

జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు.

Update: 2025-01-05 13:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. అటు ఉద్యోగం.. ఇటు ఫ్యామిలీ రెండింటినీ బ్యాలన్స్ చేయలేక చాలా మంది స్ట్రెస్ తో బాధపడుతున్నారు. కాగా ఒత్తిడి ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు కొంతమంది స్ట్రెస్ బాల్స్ ఉపయోగిస్తుండటం చూస్తూనే ఉంటాం. మరీ స్ట్రెస్ బాల్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

స్ట్రెస్ బాల్‌ను వాడితే చేతుల కండరాలు విశ్రాంతి పొందుతాయి. అలాగే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెస్‌ను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఆందోళనను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెస్ బాల్‌తో కేవలం ఒత్తిడే కాదు అనేక అనారగ్య సమస్యలు పరార్ అవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

కండరాల బలం పెరగడమే కాకుండా.. అనవసరమైన హార్మోన్లను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఒత్తిడి లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. బ్లడ్ సర్కులేషన్‌ను పెంచుతుంది. సాఫీగా జరుగుతుంది కూడా. స్ట్రెస్ బాల్స్ చేతులకు మంచి వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా చేతిగాయాల్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.         

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.         

Tags:    

Similar News