మధిర క్యాంపు కార్యాలయం చేరుకున్న డిప్యూటీ సీఎం..

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిర మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

Update: 2025-01-07 05:58 GMT

దిశ, మధిర : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిర మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐడీ మధు పట్టణ ఎస్ఐ ఎన్.సంధ్య, రూరల్ ఎస్సై బి.లక్ష్మీ భార్గవి, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

మండల కేంద్రంలోని సుందరయ్య నగర్ లో ఈ నెల 12 న సుందరయ్య నగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీల కరపత్రాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 9, 10 వ వార్డు కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, పాటిబండ్ల సత్యం బాబు తదితరులు ఉన్నారు. అనంతరం మధిర క్యాంపు కార్యాలయం నుండి మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయమన్నారు.


Similar News