Uruku Patela: ఓటీటీలోకి ‘ఉరుకు పటేలా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘హుషారు’ ఫేమ్ తేజాస్ కంచర్ల (Tejas Kancharla) థ్రిల్లర్ కామెడీ చిత్రం ‘ఉరుకు పటేల’ (Uruku Patela)
దిశ, సినిమా: ‘హుషారు’ ఫేమ్ తేజాస్ కంచర్ల (Tejas Kancharla) థ్రిల్లర్ కామెడీ చిత్రం ‘ఉరుకు పటేల’ (Uruku Patela). ‘గెట్ ఉరికిఫైడ్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాను లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి (Vivek Reddy) దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మించారు. సెప్టెంబర్ 7న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ (box office) వద్ద అనుకున్నంతా రాణించలేక పోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ (poster) రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా.. ఈరోజు స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది.
ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన మూవీ కథ విషయానికి వస్తే.. ‘ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడి కుటుంబాన్ని.. అతడిని చంపాలి అనుకుంటుంది’. ఇందులో ఖుష్బూ చౌదరి (Khushboo Chaudhary) హీరోయిన్‌గా నటించగా.. అసలు హీరో కుటుంబంపై ఆమె కున్న పగ ఏంటీ.. వాళ్లను ఎందుకు చంపాలి అనుకుటుంది.. హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓటీటీ (OTT) ఈ సినిమా చూసి ఎంజాయ్ (enjoy) చేసేయండి.
#UrukuPatela Streaming now on @PrimeVideoIN ❤️🔥#GetUrikified pic.twitter.com/zVR65AiLph
— Moviedeed (@moviedeed) October 20, 2024