ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ
దిశ, ఏపీ బ్యూరో: ఉర్దూను రెండో భాషగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Urdu is the second language in the state of Andhra Pradesh
దిశ, ఏపీ బ్యూరో: ఉర్దూను రెండో భాషగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగించిన ఎమ్మెల్యే ముస్తఫా.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు నగరంలోని వక్ఫ్‌బోర్డుకు చెందిన 300 ఎకరాల పొలం ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. మాయాబజార్‌లో చాలా మంది ముస్లింలు ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం ల జీవితాల్లో వెలుగు నింపారని తండ్రి అడుగు జాడల్లోనే తనయుడు వైఎస్ జగన్ సైతం ముస్లిం ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పుకొచ్చారు.
మాయాబజార్‌లో చాలా మంది నిరుపేద ముస్లింలు ఉన్నారని వారి జీవనోపాధి కల్పించాలంటే రెడ్డిపాలెం లో ఉన్న పొలం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. అలాగే నిరుపేద ముస్లిం లకు ఆ ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇస్తే మంచిదని సూచించారు. రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారన్న ఎమ్మెల్యే ముస్తఫా.. రెండో భాషగా తీసుకురావడం వల్ల రాష్ట్రంతో పాటు, ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందుతూ జీవించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు గుంటూరు నగరంలో బ్రహ్మనందరెడ్డి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా విజ్ఞప్తి చేశారు.