రెండో దశ ఎన్నికల్లో 12 మంది నిరక్షరాస్యులే: ఏడీఆర్ సర్వేలో వెల్లడి

Update: 2022-02-12 12:06 GMT

లక్నో: సోమవారం జరగనున్న ఉత్తరప్రదేశ్ రెండో దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిలో 114 మంది అభ్యర్థులు 8-12 తరగతుల మధ్య చదువుకోగా, 12 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా 102 మంది పీజీ పూర్తి చేయగా, ఆరుగురు పీహెచ్‌డీ చేశారని తెలిపింది. యూపీలో రెండో విడతలో తొమ్మిది జిల్లాల్లో 55 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పోటీ చేస్తున్న 586 మంది అభ్యర్థుల్లో 584 మంది స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు పేర్కొంది. వీరిలో 88.2శాతం మంది పురుషులు కాగా, 11.8శాతం మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడించింది. ఏడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags:    

Similar News