Kishan Reddy: సికింద్రాబాద్ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy Regrets Over firing In Secunderabad Railway Station| సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' స్కీమ్‌పై హైదరాబాద్‌లో ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి.

Update: 2022-06-17 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: Kishan Reddy Regrets Over firing In Secunderabad Railway Station| సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' స్కీమ్‌పై హైదరాబాద్‌లో ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. రణరంగంగా మారిన ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. నిరసనలు పెల్లుబుకుతున్న పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని అన్నారు. పోలీసులు ప్రేక్షకుల పాత్ర పోషించారని మండిపడ్డారు. ఆర్ పీఎఫ్ లా అండ్ ఆర్డర్ చూడదని.. అది కేవలం రైల్వే ఆస్తులను కాపాడుకునే బాధ్యతలనే నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్ భవన్ గేటు ముందు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తానంటే మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంత జరుగుతున్నా ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమని, అగ్నిపథ్ లాంటి పథకాలు ఇతర దేశాల్లోనూ అమలు చేస్తున్నారని అన్నారు. సింగపూర్, థాయిలాండ్, టర్కీ, మెక్సికో వంటి దేశాల్లో ఇలాంటి నియామకాలు చేపడుతున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రకటించి 2 రోజులే అయిందని ఇంతటి ఆందోళన జరగడం వెనుక ఎవరు ఉన్నారన్నదానిపై విచారణ జరగాలని అన్నారు. ఈ విషయంలో చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్దంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో రైతు చట్టాల విషయంలో తాము చర్చలు జరిపామని, తమ నిర్ణయాన్ని సైతం మార్చుకున్నామని గుర్తు చేశారు. ఈ అంశానికి కారణం ఎవరు అనేది తాను కామెంట్ చేయనని దీనిపై సమగ్రమైన విచారణ జరగాలని కోరారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే అగ్నిపథ్‌ ను తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News