Kishan Reddy: సొంత పార్టీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: GHMC పరిధిలోని సొంత పార్టీ కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Update: 2022-04-23 11:44 GMT

Kishan Reddy| Telangana

దిశ, వెబ్‌డెస్క్: GHMC పరిధిలోని సొంత పార్టీ కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వార్నింగ్ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం అయిన కేంద్ర మంత్రి.. కొంత మందిపై ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు. అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు చేశారు. కొత్త భవనాల జోలికి వెళ్లొద్దని సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, అలాగని అడ్డగోలు పోస్టులు పెట్టొద్దని హితవు పలికారు. ప్రతి కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, రాష్ట్రంలో మైన్స్ మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతోందని అన్నారు. తండ్రి, కొడుకుల ప్రభుత్వంలో ప్రతి విషయంలో వివక్ష ఉందని విమర్శించారు. ఇవాళ సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఖర్చుచేస్తున్న నిధులు ఎన్ని? ఆ పక్కనే ఉన్న దుబ్బాక నియోజకవర్గానికి ఖర్చు చేస్తున్న నిధులు ఎన్ని? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు దురుద్దేశ్యంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News