నాలుగు రోడ్లు..నాలుగు కిలో మీటర్లు..నాలుగు ఏళ్లు
దిశ, పాలకుర్తి : నాలుగు రోడ్లు..నాలుగు కిలో కిలోమీటర్లు..నాలుగు ఏళ్ళైన పనులు పూర్తికాలేదు.
దిశ, పాలకుర్తి : నాలుగు రోడ్లు..నాలుగు కిలోమీటర్లు..నాలుగు సంవత్సరాలైనా పనులు పూర్తికాలేదు. కోట్లాది రూపాయలతో చేపట్టిన పట్టణ రోడ్ల విస్తరణ పనులు నాలుగు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. పట్టణ కేంద్రం రాజీవ్ చౌరస్తాలో నాలుగు దిక్కులలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం 2018లో 21.53 కోట్ల నిధులను మంజూరీ చేసింది. ప్రభుత్వం కేటయించిన నిధులతో నాలుగు కిలోమీటర్ల పొడవు, 50 ఫీట్ల వెడల్పుతో బీటీ రోడ్లు, మూడు ఫీట్ల వెడల్పుతో సైడ్ డ్రైనేజి, మూడు ఫీట్ల ఎత్తు,డివైడర్స్ మొక్కలు నాటెందుకు 3 ఫీట్ల వెడల్పు,సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి కాలేదు. పాలకుర్తి రాజీవ్ చౌరస్తా జనగామ రోడ్డు కార్మెల్ పాఠశాల,మొండ్రాయి రోడ్డు బీసీ హస్టల్, తొర్రూర్ రోడ్డు కొడకండ్ల క్రాస్, స్టేషన్ ఘణపురం దేవస్థానం వరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదిన్నరలో పూర్తి కావాలి. అధికారుల అలసత్వము,కాంట్రక్టర్‌ల నిర్లక్ష్యం వలన పనులు ముందుకుసాగడం లేదు. పనులను పూర్తి చేయుటకు నాలుగ ఏళ్లలో ఇద్దరు కాంట్రక్టర్‌లు మారిన పనులు అసంపూర్తిగానేఉన్నాయి.
స్టేషన్ ఘనపురం రోడ్డు దేవస్థానం వరకు చేపట్టిన సైడ్ డ్రైనేజి పనుల్లో అధికారుల పర్వవేక్షణ కొరవడటంతో కాంట్రక్టర్ ఇష్టంను సారంగా పనులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు రోడ్లలో సెంట్రల్ లైటింగ్ తప్ప మిగతపనులు నత్తనడకన సాగుతున్నాయి. మొండ్రాయిరోడ్డు వైపు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చౌరస్తావరకు సైడ్ డ్రైనేజి పనులు పూర్తి స్ధాయిలో జరుగలేదు. వేసిన డ్రైనేజిపైన మూతలు వేయకుండా చాలాచోట్ల ఓపెన్‌గా వదిలేశారు. డివైడర్స్ పనుల తీరు చూస్తే కాంట్రక్టర్‌కు ప్రజాప్రతినిధుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో కూలిన డివైడర్స్ సాక్ష్యంగా నిలుస్తాయి. కొడకండ్ల క్రాస్ నుంచి జనగామ రోడ్డు కార్మెల్ స్కూల్, మొండ్రాయి బీసీ హాస్టల్ నుంచి స్టేషన్ ఘణపురం దేవస్ధానవరకు నిర్మించిన డివైడర్ నిర్మాణం చేపట్టి పట్టు మని పది రోజులు కాకముందే చాలా చోట్లకూలిపోయింది. డివైడర్స్ మధ్యలో మొక్కలు పెట్టడానికి పొయాల్సిన ఎర్రమట్టికి బదులుగా స్థానికంగా చిన్నచిన్నరాళ్ళుతోకూడిన మట్టిపోసి నిధులు కాజేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ నాయకుల మాటలు నీటిమాటలే..
రాజీవ్ చౌరస్తా అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఇండ్లను తొలగించి చౌరస్తాను విస్తరిస్తామని అధికారపార్టీనాయకులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి. సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. చౌరస్తాసర్కీల్ విస్తరణ చేయకపోవడంతో ప్రమాదాలు జరగుతున్నాయి.చౌరస్తాలో రోడ్డు విస్తరణ చేపడతామని చెప్పిన అధికార పార్టీనాయకులు మాట నిలబెట్టుకొవాలి.
బైరు భార్గవ్..కాంగ్రెస్ యువజన నాయకులు
వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు..
రోడ్డువిస్తరణ పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. గత కాంట్రక్టర్ జాప్యం చేస్తున్నారని కాంట్రక్టర్ ను మార్చినా పనులు ముందుగు సాగటం లేదు. సంబంధింత అధికారులు పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలి.
దుంపల సంపత్.. బీజేపీ పట్టణ అధ్యక్షులు
ఆలస్యం అయ్యింది నిజమే..
రోడ్డువిస్తరణ పనులలో ఆలస్యం అయ్యింది నిజమే, ఫస్ట్ పనులు దక్కించుకున్న కాంట్రక్టర్ నిర్లక్ష్యంతో అనుకున్నసమయానికి పనులుపూర్తికాలేదు. కాంట్రక్టర్ ను మార్చిన తర్వాత పనులు ఆగడంలేదు. డివైడర్స్‌లో కిందభాగంలో గట్టిమట్టి పోయడం జరగింది. మొక్కలు నాటేముందు ఎర్రమట్టిని పోస్తారు. చాలా వరకు పనులు జరిగాయి, మిగిలినపనులను త్వరలో పూర్తి చేస్తాం.
ఆర్ అండ్ బీ డీఈ జీవన్