మంచిర్యాలలో ఫేక్ సర్టిఫికెట్స్‌తో వైద్యం చేస్తున్న ఉక్రెయిన్ డాక్టర్

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించాడు. ఉక్రెయిన్‌లో ఎండీ చేసిన ఓ వైద్యుడు ఇండియన్ కౌన్సిల్ అర్హత పరీక్ష రాయకుండానే కార్డియాలజిస్ట్‌గా కొనసాగుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో శ్రీనిధి ఆస్పత్రిపై అధికారులతో కలిసి DMHO దాడులు జరిపారు.

Update: 2022-03-15 11:49 GMT

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించాడు. ఉక్రెయిన్‌లో ఎండీ చేసిన ఓ వైద్యుడు ఇండియన్ కౌన్సిల్ అర్హత పరీక్ష రాయకుండానే కార్డియాలజిస్ట్‌గా కొనసాగుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో శ్రీనిధి ఆస్పత్రిపై అధికారులతో కలిసి DMHO దాడులు జరిపారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్‌గా కొనసాగుతున్న డాక్టర్ కృష్ణమూర్తి తప్పుడు పత్రాలతో వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఎంబీబీఎస్‌కు సమానమైన విదేశీ ఎండీ సర్టిఫికేట్‌తో కార్డియాలజిస్ట్‌గా వైద్యం చేస్తూ రోగుల జీవితాలతో చలాగాటం ఆడుతున్నాడని తెలిపారు. డాక్టర్ కృష్ణమూర్తి వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణ చేసి నివేదిక సమర్పంచాలని ఆదేశించారు. తప్పుడు దృవపత్రాలతో వైద్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి కొమురం బాలు హెచ్చరించారు.

Tags:    

Similar News