బతికుండగానే మరణం.. విచారణ తప్పించుకునేందుకు ప్లాన్

దిశ, ఫీచర్స్ : డ్రైవింగ్ నేరాలకు సంబంధించిన విచారణ నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు.. Latest Telugu News..

Update: 2022-03-06 02:21 GMT

దిశ, ఫీచర్స్ : డ్రైవింగ్ నేరాలకు సంబంధించిన విచారణ నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు నమ్మించాలనుకున్న ఓ మహిళ జైలు పాలైంది. లండన్, కెన్సింగ్టన్‌కు చెందిన జో బెర్నార్డ్.. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు పాల్పడి అరెస్టయింది. దీంతో ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా నిషేధించారు. అయితే ఈ కేసులో పోలీసులను మోసం చేసేందుకు ప్రయత్నించిన బెర్నార్డ్.. మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఎసెక్స్ లైవ్ నివేదించింది. ఇక తనపై డ్రైవింగ్ బ్యాన్ కొనసాగుతున్న సమయంలోనే మరోసారి ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడి పోలీసులకు తప్పుడు పేరు చెప్పింది.

ఈ క్రమంలో నిజ స్వరూపం బయటపడగా.. తాను చనిపోయినట్లు నమ్మించాలనుకుంది. ఇక బెర్నార్డ్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ విత్ అవుట్ లైసెన్స్ సహా పోలీస్ అధికారులపై దాడి తదితర నేరారోపణలు ఉన్నట్లు విచారణలో గుర్తించిన కోర్టు.. ఆమెకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉంటే, తన సోదరి షానిస్‌గా నటిస్తూ 'బెర్నార్డ్' చనిపోయిందని చెప్పినట్లు ఒప్పుకుంది. ఇక డెత్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసినప్పటికీ, రిజిస్టర్‌లో కారణమేమీ లేనందున సర్టిఫికెట్ జారీచేయలేదు. అయినా కేసు నుంచి తప్పించుకునేందుకు తనకు శారీరక, మానసిక సమస్యలున్నాయని.. ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించినప్పటికీ న్యాయమూర్తి విశ్వసించలేదు. ఉద్దేశ్యపూర్వకంగా, ప్రణాళికతో ఈ నేరాలు చేశారని.. పోలీసులను మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు అర్థమవుతోందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News