Uddhav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Uddhav Thackeray Demands Maharashtra Governor Bhagat Singh Koshyari Should Apologize for his Controversial Remarks | మహారాష్ట్ర గవర్నర్ మరాఠీయుల గౌరవాన్ని అవమానపర్చారని మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. గుజరాతీయులు, రాజస్థానీయులు మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని
ముంబై: Uddhav Thackeray Demands Maharashtra Governor Bhagat Singh Koshyari Should Apologize for his Controversial Remarks| మహారాష్ట్ర గవర్నర్ మరాఠీయుల గౌరవాన్ని అవమానపర్చారని మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. గుజరాతీయులు, రాజస్థానీయులు మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మరాఠీయుల గౌరవాన్ని అవమానించారని, ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలన్నారు.
అలాగే గవర్నర్ మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న ఆ వ్యక్తిని ఇంటికి లేదా జైలుకు పంపించాలని థాక్రే ఆరోపించారు. వేరే రాష్ట్రాల ప్రజలు వెళ్లిపోతే ముంబై దేశానికి ఆర్థిక రాజధానిగా ఉండబోదనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు తెరిచేందుకు గవర్నర్ ఆతురత చూపుతున్నారని, కోవిడ్ కేసులు పెరిగితే ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో సావిత్రిబాయి పూలేను అవమానించినట్లే.. ఇప్పుడు మరాఠీయులను అగౌరవపరుస్తున్నారని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. గవర్నర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే ట్రైనింగ్ మొదలు పెట్టాలని?