'రేవంత్ ఓ వెధవ.. పెద్ద అహంకారి.. గజ దొంగ'
అంతరించి పోతున్న పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఓ వెధవలా రేవంత్ రెడ్డి మాట్లాతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో : అంతరించి పోతున్న పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఓ వెధవలా రేవంత్ రెడ్డి మాట్లాతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. రేవంత్ పెద్ద అహంకారి.. గజ దొంగ అని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం మీడియాతో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం మాట్లాడారు. రేవంత్‌కే గతి లేదు.. మిగతా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సభలు పెట్టి టికెట్లు అమ్ముకునే వ్యాపారం మొదలు పెట్టాడని ఆరోపించారు. దేశమంతా డిపాజిట్లు కోల్పోతున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు.
సీఎం అంటే మంత్రులంటే రేవంత్‌కు గౌరవం లేదన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీసీ లను అవమాన పరచడమేనన్నారు. ఆయన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు.'మన ఊరు మన పోరు' అని కాదు ఆ కార్యక్రమం పేరు 'బూతు పురాణం' సభ అని పెట్టుకోవాలని సూచించారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధి రేవంత్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కోర్టుల్లో కేసులే వేస్తూ మరోపక్క ప్రాజెక్టులను అడ్డుకుంటూ పాజెక్టులు నిర్మించడం లేదని మాట్లాడటంలో అర్ధం లేదన్నారు. దమ్ముంటే మల్కాజ్ గిరిలో గెలిచి చూపించాలని సవాల్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు.
రేవంత్ మాటలతో పాలమూరు ప్రజల ఆత్మ క్షోభిస్తోందని, జైపాల్ రెడ్డిని బతికి ఉన్నప్పుడు తిట్టి ఇప్పుడు పొగుడుతున్నాడన్నారు. రేవంత్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చేస్తామని స్పష్టం చేశారు. దళితులను అవమానపరిస్తే ఎవరూ సహించరన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పక పోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కొడంగల్‌లో పోటీ చేసినా మరోసారి ఓడించి తీరుతామన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా రేవంత్ పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు గెలిపించలేరన్నారు. పాలమూరు అన్ని సీట్లు టీఆర్ఎస్ యే గెలుస్తుందన్నారు.