న్యూ ఇయర్ స్పెషల్.. ఆ మూడు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్

ప్రజెంట్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు.

Update: 2024-12-24 13:12 GMT

దిశ, సినిమా: ప్రజెంట్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ స్పెషల్‌గా జనవరి-1న మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు రీరిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘హిట్లర్’. 1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే.. నితిన్ ‘సై’ కూడా రీరిలీజ్‌కు సిద్ధం అయింది. 2004లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా జనవరి-1న రీరిలీజ్ కానుంది. ఇక మ్యూజిక్ లవర్స్‌కు ఎప్పటికి గుర్తిండి పోయే సాంగ్స్‌తో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఓయ్’ సినిమా కూడా జనవరి-1న రీరిలీజ్ కాబోతుంది. ఈ మూడు సినిమాలు వేరు వేరు జోనర్‌లు అయినప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్‌గా ప్రేక్షకుల్లో ఎప్పటికి గుర్తిండిపోయే చిత్రాలుగా టాక్ సొంతం చేసుకున్నాయి. అలాంటి సినిమాలు ఇప్పుడు రీరిలీజ్‌కు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More...

Game Changer: ఆ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డా కియారా.. వీడియో వైరల్



Similar News