Sabitha Indra Reddy: మంత్రి సబితారెడ్డికి మరో తలనొప్పి
TRS Leader Manohar Reddy Demands Sabitha Indra Reddy Resign| కబ్జాలను ప్రోత్సాహిస్తున్న మహేశ్వరం ఎమ్మెల్యే,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కంటెస్టేడ్ ఎమ్మెల్యే,తెరాస సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ డిమాండ్ చేశారు. బుధవారం మీర్‌పేట పరిధిలోని మంత్రాల చెరువు, చందన చెరువును ఆయన సందర్శించారు.
దిశ, మీర్‌పేట: TRS Leader Manohar Reddy Demands Sabitha Indra Reddy Resign| కబ్జాలను ప్రోత్సాహిస్తున్న మహేశ్వరం ఎమ్మెల్యే,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కంటెస్టేడ్ ఎమ్మెల్యే,తెరాస సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ డిమాండ్ చేశారు. బుధవారం మీర్‌పేట పరిధిలోని మంత్రాల చెరువు, చందన చెరువును ఆయన సందర్శించారు. చెరువుల పరిరక్షణ సమితి, డీసీఎం వాహనదారులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఆందోళనకారులతో కలిసి స్థానిక మీర్‌పేట మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి కమీషనర్‌తో మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆమె అనుచరుల కోసం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు క్షమించరని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువు స్థలాలు, ఎఫ్‌టీఎల్ స్థలాలు కబ్జాకు గురైతే కనీసం స్థానిక ఎమ్మెల్యేగా స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మనోహర్ రెడ్డి తెలిపారు. వెంటనే ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లెలగూడలో తాజాగా పదికోట్ల జాగా కబ్జా..
చందన చెరువుకు సంబందించిన సుమారు రెండువేల గజాల ఎఫ్‌టీఎల్ స్థలం కబ్జాకు గురైంది. ఈ స్థలంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి కబ్జా చేసినట్లు కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు.ఈ స్థలంలో గత రెండు రోజులుగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు.
ఈ స్థలం కబ్జా వెనుక మంత్రి సబితారెడ్డి హస్తముందని కొత్త మనోహర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున లావాదేవీలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై దిశ ప్రతినిధి స్థానిక ఎమ్మార్వో ను వివరణ కోరగా, FTL స్థలం కబ్జా ఐన మాట వాస్తవమే అన్నారు. అక్రమ కట్టడాన్ని కూల్చి వేయనున్నట్లు ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.