పెన్షనర్లకు ప్రభుత్వం షాక్.. గతేడాది కూడా ఇంతే!

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం 2022- 23కి సంబంధించిన..latest telugu news

Update: 2022-03-07 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం 2022- 23కి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 2,56,958.51 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టాగా.. ఇందులో అధికంగా సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించారు. అయితే, పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం గతంలో 2021- 22లో కేటాయించిన రూ.11,728 కోట్లనే ఈ ఆర్థిక సంవత్సరం కూడా కేటాయించింది. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్రతినిధులు ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పినప్పటికీ.. బడ్జెట్‌ కేటాయింపుల్లో అధికంగా కేటాయించకపోవడంతో.. కొత్త పెన్షన్లు కష్టమేనని నెట్టింట చర్చ జరుగుతోంది. దీంతో గత మూడేళ్లుగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తోన్న లబ్దిదారులకు నిరాశే మిగిల్చింది. అయితే, ఈ ఏడాది నుంచి కొత్త పెన్షన్లు అమలు కానున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించినా.. బడ్జెట్ పెంచకపోవడంపై నిపుణులు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా, అటవీ శాఖకు గతేడాది రూ.1276కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ. 932 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా, ఈ ఏప్రిల్ నుంచే హరిత నిధి ద్వారా నిధులు సమీకరించనున్నారు.

Tags:    

Similar News