గిరిజన నాయకులకు రేవంత్ రెడ్డి హామీ.. పటిష్ట భద్రత కల్పించాలని..

దిశ, మాచారెడ్డి: లంబాడ హక్కులు, సమస్యలపై కామారెడ్డి జిల్లా..Tribal leaders met Revanth Reddy

Update: 2022-03-11 11:14 GMT

దిశ, మాచారెడ్డి: లంబాడ హక్కులు, సమస్యలపై కామారెడ్డి జిల్లా గిరిజన నాయకుడు శుక్రవారం హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమై సుదీర్ఘమైన చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ మాచారెడ్డి మండల కమిటీ అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గణేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ల పెంపు 6% నుండి 12%, పోడు భూములు, పోరంబోకు భూములు, 1/70 ఎల్ టీఆర్ & 2006 ఎఫ్ఆర్ఏ చట్టాలపై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. గిరిజన సమస్యలతోపాటు పోడు భూములు, అసైన్డ్ భూములు, అనాదిగ వ్యవసాయం చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి, గిరిజనులపై అక్కడక్కడ వేసిన అనుచిత కేసులను విరమించి గిరిజనులకు పటిష్ట భద్రత కల్పించాలని.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పై కూడా ఒత్తిడి చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. పంచాయతీలుగా మారిన తండాలను రెవెన్యూ గిరిజన గ్రామాలుగా గుర్తించి, ప్రణాళికా బద్ధమైన బడ్జెట్ కేటాయింపులు పొందే విధంగా చట్టబద్ధత కల్పించేలా కృషి చేయాలని వారు రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. తెలంగాణ పీఏసీ కన్వీనర్ రాష్ట్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మాచారెడ్డి మండల అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా సీనియర్ నాయకురాలు జమున రాథోడ్, సర్పంచ్ మాలోత్ నౌసీలాల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News