KANGUVA EDITOR: ఇండస్ట్రీలో విషాదం.. ‘కంగువా’ ఎడిటర్ అనుమానాస్పద మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కొలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ అయినటువంటి ‘కంగువా’ సినిమాకు పని చేసిన ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు.
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కొలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ అయినటువంటి ‘కంగువా’ సినిమాకు పని చేసిన ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు. 43 ఏళ్ల నిషాద్ కేరళ పనమ్పిల్లీ నగర్‌లోని తన అపార్ట్మెంట్లో మరణించారు. ఈయన అర్ధ రాత్రి 2 గంటల సమయంలో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈయన నిషాద్ థల్లుమాలా, చావెర్, ఉండా వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.