ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మిర్చి, పత్తి రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2022-03-15 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మిర్చి, పత్తి రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల ఆత్మహత్యలు ఎంతగానో కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు సమస్యలు ఎత్తి చూపితే 'మేమెందుకు స్పందించాలి' అన్నట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వ మొండి ధోరణితో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో రెండు నెలల కాలంలో 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణపై దృష్టి సారించాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, రూ.లక్ష రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వారి ప్రైవేటు అప్పులను వన్ టైం సెటిల్‌మెంట్ కింద పరిష్కరించేలా చూడాలన్నారు. రైతు బీమా రాని కుటుంబాలకు జీవో 194 అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్లపై వెంటనే స్పందించాలని, లేని పక్షంలో రైతుల తరపున క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News