వాహనాల ధరలను 4% పెంచిన ప్రముఖ కార్ల సంస్థ

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ శనివారం..telugu latest news

Update: 2022-03-26 08:18 GMT
వాహనాల ధరలను 4% పెంచిన ప్రముఖ కార్ల సంస్థ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ శనివారం తన అన్ని మోడల్స్‌పై ఏప్రిల్ 1 నుండి 4 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని భర్తీ చేయడానికే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ తెలిపింది. ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లను విక్రయించే కంపెనీ, ముడి పదార్థాలతో సహా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ధరలు పెంచుతుంది. వినియోగదారులపై పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికి TKM అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది. కానీ పెరుగుతున్న ఖర్చుల భారాన్ని భర్తీ చేసేందుకు ధరల పెంపు తప్పటం లేదని కంపెనీ పేర్కొంది. ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచాలని యోచిస్తున్నాయి.

Tags:    

Similar News