మెగా హీరోపై మనసు పారేసుకున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. పిచ్చిగా లవ్ చేస్తున్నానంటూ కామెంట్స్

‘మత్తు వదలరా-2’ సినిమాలో రియా పాత్రలో నటించిన ఇషా యాదవ్(Isha Yadav) ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

Update: 2024-10-28 08:30 GMT

దిశ, సినిమా: ‘మత్తు వదలరా-2’ సినిమాలో రియా పాత్రలో నటించిన ఇషా యాదవ్(Isha Yadav) ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. గత కొద్ది రోజుల నుంచి రియా అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు నెట్టింట పలు వీడియోలు షేర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించి ఫుల్ ఫేమస్ అయింది. తెలుగులో ‘మత్తు వదలరా-2’(Mathu Vadalara 2)లో చాన్స్ దక్కించుకుని ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఈ క్రమంలో.. తాజాగా, ఇషా(Isha Yadav) మెగా హీరోపై మనసు పారేసుకుంది.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ‘‘చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్(Ram Charan) అంటే చాలా ఇష్టం. ‘రచ్చ’ సినిమాలో ఆయనను చూసి అభిమాని అయిపోయాను. రామ్ చరణ్(Ram Charan) యాక్టింగ్, డ్యాన్స్, అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో నటించాలని ఉంది. మత్తు వదలరా-2 చేస్తున్నప్పుడు కూడా ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythry Movie Makers) టీమ్‌లోని ప్రొడ్యూసర్ చెర్రీ(cherry)కి చెప్పాను.

రామ్ చరణ్(Ram Charan) సినిమాలో ఏ రోల్ ఇచ్చినా పర్వాలేదు నేను చేస్తానని రిక్వెస్ట్ చేశా. ఆయనంటే నాకు పిచ్చి. ఆయనకు పెళ్లి అయినప్పుడు చాలా బాధపడ్డాను. రీసెంట్‌గా పాప కూడా పుట్టిందని ఇంకా ఎక్కువ బాధపడ్డా’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇషా(Isha Yadav) కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

Trisha: అమితంగా ప్రేమిస్తున్నా.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన త్రిష!


Full View

Tags:    

Similar News