Samantha:‘సాయం చేసిన వారిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి’ .. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-18 04:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్, టీజర్ విడుదలై జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ‌లో సమంతకు జోడిగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో సినీ ప్రియుల్ని మురిపించిన సామ్ ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో పలు కామెంట్లు చేసింది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సిటాడెల్ ను తిరస్కరించిందని చెప్పుకొచ్చింది.

అప్పుడే వ్యాధి నిర్ధారణ అయ్యింది: సామ్

అలాగే ఈ సిరీస్ కోసం సామ్ ను అప్రోన్ అయినప్పుడు అప్పుడే మయోసైటిస్ తో బాధపడుతోన్నట్లు వెల్లడించింది. ఆ సమయంలోనే ఆ వ్యాధి అని నిర్ధారణ అయ్యిందని తెలిపింది. ఇక సమంత ఇందులో నటించలేనని, వేరే హీరోయిన్లను ఎంపిక చేసుకోమన్నని చెప్పిందట. కానీ దర్శకులు సామ్ ఆరోగ్యం కుదుటపడేవరకు వెయిట్ చేశారని పేర్కొంది. ఈ అవకాశం నా అదృష్టమని.. డైరెక్టర్ కు నా కృతజ్జతలు అంటూ తెలిపింది. ఇప్పటివరకు తను ఎక్కువగా కష్టపడ్డ మూవీ అంటే సిటాడెల్ అని వివరించింది.

వీరంతా దొరికినందుకు నా అదృష్టం

ఈ టీమ్ తనకు ఎంతో ధైర్యాన్ని నింపిందని, నాపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడని అప్పుడు అర్థం అయిందని తెలిపింది. కానీ సాయం చేసిన వారిని ఎప్పుడు గుర్తుంచుకోవాలని.. రాజ్ అండ్ డీకే తో పాటు ఈ టీమ్ దొరికినందుకు అదృష్టవంతురాలిని అని పేర్కొంది. కానీ ఇంటెన్స్ సీన్స్ షూట్ చేసినప్పుడు తల తిరిగేదాని.. ఇక అప్పుడు నా వల్ల కాదని అనిపించేదని సామ్ వెల్లడించింది.


Similar News