Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటులు బాలయ్య(94) కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటులు బాలయ్య(94) కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని తన స్వగృహంలో బాలయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం(శోభన్ బాబు హీరో), నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. బాలయ్య మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మరణావార్త తెలిసిన సినీ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, పుట్టినరోజు నాడే బాలయ్య మరణించడం ఇండస్ట్రీలో విషాదం నింపింది. విక్టరీ వెంకటేశ్‌తో మళ్లీశ్వరీ, కింగ్ నాగార్జునతో మన్మదుడు సినిమాలో నటించి, ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వెంకటేశ్, నాగార్జున ఆయన మరణ తెలిసి, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.