'మరోసారి అమ్మను కాబోతున్నా' అంటూ గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్(పోస్ట్)

2005లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సనాఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-11-23 02:36 GMT

దిశ, సినిమా: 2005లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సనాఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ‘కత్తి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తన ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకునకున్నది.దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మిస్టర్ నూకయ్య’, ‘గగనం’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసిన ఈ బ్యూటీ తర్వాత కనిపించకుండా కనుమరుగైపోయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సనాఖాన్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది అందులో తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Full View

Tags:    

Similar News