Heater: సెగలు పుట్టిస్తున్న హీటర్.. రూ.200లకే రాత్రంతా హాట్ హాట్

శీతాకాలంలో కరెంట్ ఖర్చు బాగా పెరుగుతుంది

Update: 2025-01-10 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : చలికాలంలో గదిని వేడిగా ఉంచేందుకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. అయితే, కొందరు గది తలుపులను,  కిటీకీలను మూసివేస్తారు. ఇంకొందరు హీటర్లను వాడతారు. అయితే, హీటర్లు వాడటం వలన కరెంట్ బిల్ విపరీతంగా వచ్చేస్తుంది. అయితే, మార్కెట్లో దొరికే చిన్న హీటర్లు కూడా గదిని వేడిగా ఉంచుతాయి. ఇప్పుడు చెప్పుకోబోయే హీటర్ కి కరెంట్ కూడా అవసరం లేదు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

తక్కువ సమయంలో గదిని వేడి చేయాలనుకుంటే, చిన్న సిలిండర్‌తో తయారు చేసిన ఈ రూమ్ హీటర్‌ను తెచ్చుకోండి. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. కానీ, గదిని తొందరగా వేడి చేస్తుంది. సాధారణంగా, శీతాకాలంలో కరెంట్ ఖర్చు బాగా పెరుగుతుంది. కాబట్టి, కరెంట్ ను ఆదా చేయాలంటే  ఈ గ్యాస్ సిలిండర్ హీటర్ ను వాడండి. దీని ధర  రూ. 200లు మాత్రమే.   ఎలక్ట్రిక్ హీటర్లు అంత సురక్షితం కావు, వాటికీ బదులు ఈ సిలిండర్ హీటర్లు ఉపయోగిస్తే చిన్న పిల్లలకు ప్రమాదాలు  జరగకుండా ఉంటాయి. 

Tags:    

Similar News