పెళ్లైన రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. కొత్త ప్రారంభం అంటూ పోస్ట్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అల్లు అర్జున్‌కు జంటగా ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అల్లు అర్జున్‌కు జంటగా ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చి.. తక్కువ టైంలోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో వరుసగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ, హన్సికను టాలీవుడ్ పెద్దగా ఆదరించలేదనే చెప్పాలి. అయితే ఈ భామకు తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. తర్వాత బరువు పెరగడంతో హన్సికకు సినిమా అవకాశాలు తగ్గాయి.
ఈలోగా సినిమాలో జంటగా నటించిన హీరో సింబుతో ప్రేమలో పడ్డారు. కానీ కొన్నేళ్లకే వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. బరువు తగ్గించుకుని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది హన్సిక. దాంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2022 లో తన ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. కాగా సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. ఇక పెళ్లయిన తర్వాత కూడా హన్సిక సినిమాల్లో నటిస్తోంది. అగ్ర హీరోలతో నటించే అవకాశం లేకపోయినా, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది. అలాగే తెలుగులో ప్రసారమయ్యే ఢీ షోకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పెళ్లయి రెండేళ్లు అవుతున్న హన్సిక.. ఇప్పుడు ఒక శుభవార్త చెప్పింది. కొంపదీసి ప్రెగ్నెంట్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఆమె తన భర్త సోహైల్ కతూరియాతో కలిసి అందమైన బంగ్లా కట్టి, గృహప్రవేశం చేసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కొత్త ప్రారంభం అంటూ హన్సిక పోస్ట్ చేసిన ఫొటోలకు లైక్‌లు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హన్సిక గృహప్రవేశంలో ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది.
(video link credits to hanshika instgram id)