లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ ఫేమస్ నటుడు.. మరో పుష్పరాజ్‌లా ఉన్నావంటున్న నెటిజన్లు

సాధారణంగా సినిమాల్లోని క్యారెక్టర్‌ల కోసం చాలా మంది నటులు తమను తాము మార్చుకుంటూ ఉంటారు.

Update: 2024-10-20 03:05 GMT

దిశ, సినిమా: సాధారణంగా సినిమాల్లోని క్యారెక్టర్‌ల కోసం చాలా మంది నటులు తమను తాము మార్చుకుంటూ ఉంటారు. జుట్టు, గడ్డం భారీగా పెంచడం, బరువు పెరగడం, సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడం.. ఇలా పాత్రలకు తగ్గట్టుగా యాక్టర్స్ మారిపోతుంటారు. అయితే మూవీల కోసం లేడీ గెటప్పులు వేసే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పొచ్చు. అలా లేడీ గెటప్‌ వేసిన వారిలో చిరంజీవి(చంటబ్బాయి), విక్రమ్(మల్లన్న), అల్లు అర్జున్(పుష్ప2), రాజేంద్రప్రసాద్(మేడమ్).. ఇలా తదితర హీరోలు లేడీ గెటప్పుల్లో కనిపించి అభిమానులను అలరించారు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరిపోయాడు. లేడీ గెటప్‌తో ఈ యాక్టర్.. తన అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. మరి ఇంతకీ అతనెవరో ఇప్పుడు మనం చూద్దాం..

అతను మరెవరో కాదండోయ్ సుమారు ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అజయ్. ఈయన విలన్‌గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానూ ట్రై చేశాడు కానీ క్లిక్ అవ్వలేకపోయాడు. ఇక రవితేజ నటించిన 'విక్రమార్కుడు' సినిమాలో టిట్లా పాత్రతో టాలీవుడ్ ఆడియన్స్‌ను భయపెట్టిన అజయ్.. ప్రస్తుతం అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తోన్న పొట్టేల్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలు పోషించాడు.

కాగా అజయ్ విలన్ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ ట్రైలర్‌లో అజయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మరీ ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్‌లో ఏకంగా లేడీ గెటప్‌తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీనిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరో పుష్పరాజ్‌లా ఉన్నావంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Full View



Similar News