Today Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న చలితీవ్రత..!!
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మార్నింగ్ 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పొగ మంు కనిపిస్తుందని తెలిపింది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇక మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ పేర్కొంది. కానీ ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తుందని వెల్లడించింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.