చరిత్రలో ఈ రోజు..

దిశ, ఫీచర్స్: కల్కా-సిమ్లా రైలుమార్గాన్ని 2008 జూలై 8న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది..Latest Telugu News

Update: 2022-07-08 04:55 GMT

దిశ, ఫీచర్స్: కల్కా-సిమ్లా రైలుమార్గాన్ని 2008 జూలై 8న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. 1898 -1903 మధ్య బ్రిటిష్ అధికారి 'హెర్బర్ట్ సెప్టిమస్ హారింగ్‌టన్' నేతృత్వంలో‌నే ప్రసిద్ధిగాంచిన ఈ రైలు.. సిమ్లాను మిగిలిన భారతీయ రైలు వ్యవస్థతో అనుసంధానించడానికి నిర్మించబడింది.

హర్యానా రాష్ట్రం పంచకుల జిల్లాలో ఉన్న దీని పూర్తి ప్రయాణ మార్గం 96.6 కిలోమీటర్లు. కాగా 102 సొరంగాలను దాటుకుని ప్రయాణిస్తుంది. అలాగే ఈ రైలుమార్గంలో అతి ఎత్తయిన స్టేషన్ సిమ్లా- కల్కా. అతి పొడవైన సొరంగం 'బారోగ్'. ఇది కల్కా నుంచి సిమ్లా వరకు పెద్ద కొండల మార్గంలోనే ఎక్కవశాతం ప్రయాణిస్తుండగా.. పర్వతాలు, పల్లెల అందాలు వీక్షకులకు కనువిందు చేస్తాయి.


Similar News