దిశ, వెబ్‌డెస్క్: మనం జీవితంలో గాలి, నీరు, ఆహారంతో పాటు నడుము నొప్పి భాగమైపోయింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. ప్రత్యేకంగా మహిళలల్లో నడుము నొప్పి సమస్య అధికంగా ఉంది.100 మంది మహిళల్లో 99 మంది నడుం నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో కరోనా పుణ్యమా అని ఇంట్లో కూర్చుని పనులు చేయ్యడం ఎక్కువైంది. చాలా రోజుల తర్వాత పనిలోకి దిగడంతో శారీరక సమస్యలు అధికమయ్యయి. అందులో నడుము నొప్పి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే చాలా మంది ఈ నొప్పికి ఏదో ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది.
కానీ వెన్నెముకలో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాల్లో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలుగా నిలుస్తాయి. ఇలా మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి. వెన్నెముక సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి సర్వసాధారణం. అది ఎక్కువ మందిలో కనిపించేదే. కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నెముకతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. అయితే కొన్ని గృహ చిట్కాలతో నడుం నొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో చూసేద్దాం..
* ఎక్కువగా ఆహారాన్నిమితంగానే తీసుకోవాలి. బాగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
* ఖాళీ సమయాన్ని యోగా, స్పోర్ట్స్ లేదా డాన్స్ వంటి వాటికి కేటాయించండి. దీనివల్ల కండరాలు, ఎముకలు దృఢపడతాయి.
* అదే విధంగా ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం పనికిరాదు. కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు మంచి పోజర్‌ని మెంటైన్ చేయండి.
* బరువులను ఎత్తేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.
* ఒక్కసారిగా వంగడం, ఏదైనా ఎత్తడం ఇలాంటివి చేయకూడదు.
* స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్లు స్మోకింగ్ మానేయడం మంచిది.
* టైంకి నిద్ర పోవడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గించుకోవచ్చు.
ఇలా ఈ విధమైన చిట్కాలను ఫాలో అయితే కచ్చితంగా నడుము నొప్పి నుంచి బయటపడొచ్చు.