KCR: ‘కేసీఆర్’ సినిమా ట్రైలర్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్..

బుల్లితెర ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు.

Update: 2024-10-18 13:38 GMT

దిశ, సినిమా: బుల్లితెర ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మరో నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన రాకింగ్ రాకేష్(Rocking Rakesh) ఇన్నాళ్లు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన ఆయన హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాకేష్, ‘గరుడ వేగ’ ఫేమ్ అంజి(Anji) కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ అయితే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా పాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ‘కేసీఆర్’(KCR) మూవీపై హైప్ పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. ఇన్నాళ్లు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు. తాజాగా, కేసీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 19న ఉదయం 10.30 గంటలకు రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. కాగా, రాకింగ్ రాకేష్ పర్సనల్ లైఫ్ విషయానికొన్తే.. ఆయన జబర్దస్త్ షోలో జోర్దార్ సుజాతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వీరికి ఓ పాప కూడా పుట్టింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టడంతో నెటిజన్లు కంగ్రాట్స్ చెప్పారు.

 

Tags:    

Similar News