సమంతతో నటించొద్దని నాకు వారు వార్నింగ్ ఇచ్చారు.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-19 06:21 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో మనముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్‌ను ‘ఫ్యామిలీ మెన్‌2’ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. కాగా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్ నవంబర్ 7నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల జోరు కొనసాగుతోంది.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ హీరో వరుణ్ ధావన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “సమంతతో నటించవద్దని నాకు చాలా మంది సలహాలు ఇచ్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు సమతంతో యాక్టింగ్ చేయోద్దని, తనతో నటిస్తే నీకున్న క్రేజ్ పోతుందని వార్నింగ్ ఇచ్చారు” అంటూ వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవడంతో.. ఎవరో సమంత ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అలా అంటున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News