Blood tests: దీర్ఘాయుష్షు పెంచుకోవాలా.. ఈ పరీక్షలు తప్పనిసరి..!!

ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పుల కారణంగా జనాలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

Update: 2024-12-28 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పుల కారణంగా జనాలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాగా హెల్తీగా ఉండేందుకు.. అలాగే దీర్ఘాయుష్షును పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకుంటారు. భారీ కసరత్తులు చేస్తుంటారు. అయితే వీటితో పాటు వైద్య పరీక్షలు కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. వైద్య పరీక్షలతో ఎన్నో వ్యాధుల్ని తొలి దశలోనే గుర్తించవచ్చని చెబుతున్నారు. దీంతో రోగ చికిత్సల ప్రభావం కూడా పెంచుకోవచ్చు. మరీ హెల్తీగా ఉండేందుకు క్రమం తప్పకుండా ఏఏ టెస్టులు చేయించుకోవాలో ఇప్పుడు చద్దాం..

విటమిన్ డి టెస్టు కీలకం..

మెనోపాజ్ అనంతరం మహిళల్లో హార్మోనల్ మార్పులు జరుగుతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వ్యాధి తలెత్తుతుంది. కాగా బ్లడ్‌లో విటమిన్ డి స్థాయి ఎంతుందో తెలుసుకునేందుకు ఈ టెస్టు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

కిడ్నీ ఫంక్షన్ పరీక్ష..

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. కాగా కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే కిడ్నీ ఫంక్షన్ పరీక్ష చేయించుకోవాలి. దీంతో క్రియాటినైన్, బ్లడ్ యూరియా నైట్రోజన్ ఎంతుందో ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు.

హెచ్‌బీఏ 1 సీ..

ప్రజెండ్ డేస్‌లో డయాబెటిస్ పెషేంట్లు విపరీతంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా రెండు నెలల్లో షుగర్ లెవల్స్‌ను ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు హెచ్‌బీఏ 1 సీ టెస్ట్ అవసరం అంటున్నారు నిపుణులు. హెచ్‌బీఏ 1 లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవచ్చు.

లివర్ ఫంక్షన్ పరీక్ష..

కీలక పాత్ర పోషించే వాటిలో లివర్ ఒకటి. బ్లడ్‌లో పలు రకాల ఎంజైమ్‌లు, బిలిరుబిన్, ప్రోటీన్ల స్థాయిల్ని చెక్ తప్పకుండా చెక్ చేయించుకోవాలి. కాగా ఇందుకు లివర్ టెస్టులు అవసరం.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News