బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బొగ్గు సరఫరాకు - "There is no shortage of money for coal supply in the state and we are making timely payments," Energy Secretary Sridhar said.
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదని, సమయానికి చెల్లింపులు చేస్తున్నామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగిందన్నారు. సెకీతో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. దీన్ని రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నామన్నారు. కోల్ ఇండియా సంస్థకు రూ.150 కోట్లను శనివారం చెల్లించామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయన్నారు. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయని అన్నారు. 2018-19 కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక డిస్కంలకు రూ.36 వేల కోట్లు చెల్లింపులు చేశారని పేర్కొన్నారు.