చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌కు పవర్ కట్: ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
కీవ్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన అణు విపత్తు సంభవించిన చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరాను ..telugu latest news
కీవ్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన అణు విపత్తు సంభవించిన చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఎనర్జీ ఆపరేటర్ ఉక్రెనెర్గో తన ఫేస్‌బుక్ ద్వారా గురువారం ప్రకటించారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యా ఇటీవల చెర్నోబిల్ లోని అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబు దాడులకు పాల్పడింది. అదృష్టవశాత్తు ప్లాంట్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఒకవేళ రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ప్లాంటుకు ఏదైనా నష్టం వాటిల్లితే అది ఒక్క ఉక్రెయిన్‌కు మాత్రమే కాకుండా సరిహద్దు పంచుకుంటున్న యూరప్ దేశాలకు కూడా తీవ్ర నష్టం కలిగింది. 1986లో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం వలన వందలాది మంది చనిపోయారు. ఈ ఘటన వలన వెలువడిన రేడియోధార్మిక కాలుష్యం పశ్చిమ ఐరోపా అంతటా వ్యాపించింది. అయితే, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడిన రష్యా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆ ప్లాంట్‌కు రష్యన్ ఆర్మీ భద్రతగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్లాంట్ స్థిర నిర్వహణ కోసం అందులో నేటికీ 2000 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నట్లు సమాచారం. న్యూక్లియర్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో భద్రత పరంగా ఎటువంటి ప్రమాదం లేదని యూఎన్ అటామిక్ వాచ్‌డాగ్ వెల్లడించింది.