యంగ్ హీరో నటించిన ‘క’ ట్రైలర్ వచ్చేసిందోచ్.. పక్కా దీపావళి బ్లాస్ట్ అంటున్న నెటిజన్లు..

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బవ‌రం న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క‌’.

Update: 2024-10-25 05:17 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బవ‌రం న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క‌’. సుజీత్, సందీప్ ఇద్దరి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. న‌య‌న్ సారిక‌, త‌న్వి రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన గ్లింప్స్‌, టీజ‌ర్‌, రెండు పాట‌లు అల‌రించాయి. ఇక ఈ మూవీ దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్నడ బాష‌ల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది.

కాగా.. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ‘క’ సినిమా ట్రైలర్ చూస్తే.. కృష్ణగిరి అనే ఓ ఊరిలో పోస్ట్ మ్యాన్‌గా అభినయ వాసుదేవ్ పనిచేస్తుంటాడు. అలాగే అక్కడ ఓ అమ్మాయితో ఇతను ప్రేమలో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమని ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది..?, వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు బెదిరిస్తున్నారు అని ఆసక్తిగా సినిమా ఉండబోతున్నట్లు, చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ఇక ట్రైలర్ చూసిన నెటిజన్లు ‘పక్కా దీపావళి బ్లాస్ట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘క’ ట్రైలర్‌ను చూసేయండి.

Full View

(video link credits to saregama telugu youtube channel)

Tags:    

Similar News