తెలంగాణ పోలీసుల‌కు షాకిచ్చిన స్కూట‌ర్.. ట్విట్ట‌ర్‌లో మొత్తుకున్న టీఎస్పీ! (వీడియో)

ఈ వీడియోను చూసి ఎంత మంది మార‌తారో చూడాలి. Telangana Police retweeted a video of a man riding overloaded scooter.

Update: 2022-06-22 13:15 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ పాటించే వాహ‌నాలు త‌యారుచేస్తే త‌ప్ప వాటిని న‌డిపే మ‌నుషులు దారిలోకి రారు. ఇలా చేయ‌డం కాస్త తేలికే కావ‌చ్చు కానీ, ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఆటోరిక్షాలా, కారులా, కొంత‌మంది ఆటో ట్ర‌క్కులా కూడా మార్చేస్తుంటారు. ఇలాంటి వారిలో మాత్రం మార్పు సొంత‌గా రావాల్సిందే. అందుకే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘింస్తూ, ప్రమాదకరంగా రైడింగ్ చేస్తున్న వ్యక్తులను చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వ‌స్తూనే ఉంటాయి. అలాంటి ఒక వీడియో ట్విటర్‌లో షేర్ చేశారు. ఒక వ్యక్తి స్కూటర్‌ను నడుపుతున్నట్లు క‌నిపించే ఈ వీడియోలో ఆ వ్యక్తి కాకుండా స్కూట‌రంతా మూట‌ల‌తోనే నిండిపోయి ఉంటుంది. ఈ ఓవర్‌లోడ్లో డ్రైవ‌ర్ ఎప్పుడు ప‌డిపోతాడా అన్న‌ట్లు ఉంటుంది కండీష‌న్‌. @sagarcasm అనే ట్విటర్ యూజర్ జూన్ 21న తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయ‌గా, తెలంగాణ పోలీసులు కూడా య‌ధావిధిగా సలహా ఇస్తూ దాన్ని రీట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు 7.23 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోను చూసి ఎంత మంది మార‌తారో చూడాలి. "నా 32GB ఫోన్ 31.9 GB డేటాను తీసుకువెళుతోంది" అని చీక్ క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయగా, తెలంగాణ పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్‌లో రీపోస్ట్ చేస్తూ, "మొబైల్ నుండి డేటా పాడైపోతే దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి, ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులను కూడా ప్రమాదంలో పడేయకుండా ఉండాల‌ని ప్రజలకు మా విజ్ఞప్తి" అని స‌ల‌హా ఇచ్చారు. 


Similar News