అమ్మాయి పై హీరో లైంగిక దాడి.. అరెస్టు చేసిన పోలీసులు
దిశ, సినిమా : ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్ : ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్’ ఫేమ్ ఎజ్రా మిల్లర్‌ను latest telugu news..
దిశ, సినిమా : ప్రముఖ హాలీవుడ్ నటుడు 'ఫెంటాస్టిక్ బీస్ట్స్ : ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్' ఫేమ్ ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యూఎస్‌లోని ఓ బార్'లో మద్యం సేవించిన తను అక్కడి మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందున అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం హవాయిలోని 'హిలోలో బార్'లో ఓ 23 ఏళ్ల అమ్మాయి కరావోకే సాంగ్స్ పాడుతుండగా.. మిల్లర్ ఆమె దగ్గరకు వెళ్లి సెక్సువల్ వర్డ్స్‌తో దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తి్ంచాడు.
ఎదురు తిరిగిన అమ్మాయి నుంచి మైక్రోఫోన్ లాక్కోవడంతో పాటు అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని బార్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు.. క్రమశిక్షణ చర్యల కింద 500 యూఎస్ డాలర్లు జరిమానా చెల్లింపుపై విడుదల చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎజ్రా మిల్లర్.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ 'ఫెంటాస్టిక్ బీస్ట్స్' ప్రమెషన్‌లో బిజీగా ఉండగా 2022 ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది.