ఆ నీళ్లు చంద్రుడికి సంబంధించినవే.. శాస్త్రవేత్తల నిర్థారణ!
పరిశోధనలను నేచర్ కమ్యూనికేషన్స్‌లో పేపర్‌లో ప్రచురించారు. Confirmed the native origin of water on the Moon.
దిశ, వెబ్‌డెస్క్ః భూమిపైన ఎక్కువ భాగం నీటితో నిండి ఉంది. కానీ, ఈ నీరు చంద్రుని కదలికలను బట్టి స్పందిస్తూ ఉండటం విశేషం. అయితే, రాత్రి ఆకాశంలో ప్రముఖ స్థానం ఉన్న చంద్రుడు ఒక నిర్జనమైన ప్రకృతి దృశ్యంగానే మనకు కనిపిస్తుంది. అయితే, భూమికున్న ఈ ఏకైక ఉపగ్రహం ఉపరితలం పైన అంతరిక్ష శిలలతో పాటు నీరు కూడా ఉందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నీరు ఏర్పడటానికి కారణాలపై పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించి, చైనాకు చెందిన చాంగ్'ఇ-5 లూనార్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. చంద్రునిపై కనిపించే నీరు నిజంగా చంద్రునికి చెందినదని చంద్ర ల్యాండర్ నిర్ధారించింది! భూమిపై చంద్రుడి నమూనాలను విశ్లేషించే పరిశోధకులు తమ పరిశోధనలను నేచర్ కమ్యూనికేషన్స్‌లో పేపర్‌లో ప్రచురించారు. ఇందులో, చంద్రుడిపై నీటి స్థానిక మూలాన్ని నిర్ధారించారు.
అపోలో మిషన్ల నుండి సేకరించిన చంద్రుడి మట్టి నమూనాల్లో నీరు, హైడ్రాక్సిల్ కనుగొన్నారు. ఈ హైడ్రాక్సిల్ ఒక ఆక్సిజన్ పరమాణువుతో అనుబంధించబడిన ఒక హైడ్రోజన్ అణువును కలిగి ఉంటుంది. చంద్రునిపై హైడ్రాక్సిల్ అయాన్ ప్రధానంగా చంద్రుడిని తాకిన సౌర గాలిలోని హైడ్రోజన్ అణువుల వల్ల ఏర్పడుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి, చాంగ్'ఇ తీసిన నమూనాల్లోని హైడ్రాక్సిల్ అయాన్లలో మూడింట ఒక వంతు సౌర గాలి నుండి వచ్చినప్పటికీ, మిగిలిన హైడ్రాక్సిల్ కంటెంట్ చంద్రునిపై అపాటైట్ అనే ఖనిజం నుండి వచ్చినట్లు పరిశోధనా పత్రం తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే, చంద్రునిపై కనిపించే నీరు చంద్రునికి చెందినదని రుజువయ్యింది!