టెంపర్‌లో ఎన్టీఆర్‌ను మరిపించిన రియల్ పోలీస్

దిశ, వెబ్‌డెస్క్: అవినీతికి పాల్పడిన పోలీసులు.. లంచాలు తీసుకుంటూ దొరికిపోయన సందర్భాలు చాలా ఉంటాయి.

Update: 2022-06-27 12:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: అవినీతికి పాల్పడిన పోలీసులు.. లంచాలు తీసుకుంటూ దొరికిపోయన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే, అలా దొరికిన వారిలో ఎక్కువశాతం మగ పోలీసులే ఉండటం గమనార్హం. కానీ, ఇక్కడ ఒక మహిళా పోలీస్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌నే మరిపించే రేంజ్‌లో అవినీతికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. బార్లుట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్‌హెచ్‌ఓ సీమా జఖర్ స్మగ్లర్లతో కుమ్మక్కైంది. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో గుజరాత్‌ను ఆనుకుని ఉన్న సిరోహి జిల్లాలోని బార్లుట్ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లింది ఈ లేడి సింగం.

స్పాట్‌కు వెళ్లిన తర్వాత మాత్రం భిన్నంగా వ్యవహరించి, దొరికిన స్మగ్లర్లను పట్టుకోకుండా వారితో రాజీ కుదుర్చుకునేది. స్మగ్లర్ల నుంచి లక్షల్లో సొమ్ము తీసుకుని అనంతరం తన వ్యక్తగత వాహనంలోనే వారిని తప్పించుకునేందుకు సహకరించేది. తరువాత డ్రగ్స్ మాఫియా నుంచి లంచం తీసుకున్న ఆరోపణలు రావడం, అవి నిజం అని తేలడంతో గతేడాది ఆమెను విధులు నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీమా జాఖర్ పెళ్లి కూడా చేసుకుంది. ఆమెకు రాజకీయ పలుకుబడి కుడా చాలా ఎక్కువగా ఉంది. పలువురు స్థానిక నేతలు ఆమె వివాహానికి హాజరయ్యారు. సీమా పెళ్లి వీడియోలు, ఫొటోలు చాలా కాలం సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయితే తాజాగా.. పోలీసులు ఆదివారం సీమా జాఖర్‌ను మరోసారి అరెస్టు చేసి స్వరూపగంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, మళ్లీ ఎందుకు అరెస్ట్ చేసారనేది విచారణలో తేలాల్సి ఉంది.


Similar News