మర్మంగాలు కోసి ఉరివేసి.. ఆత్మహత్యగా చిత్రీకరణ!
మురుగు నీటి విషయంలో జరిగిన ఘర్షణలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి నుంచి వచ్చే మురుగు నీరు తమ
దిశ, దేవరకొండ : మురుగు నీటి విషయంలో జరిగిన ఘర్షణలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి నుంచి వచ్చే మురుగు నీరు తమ ఇంట్లోకి వస్తున్నాయని ప్రశ్నించిందుకు వృద్ధ దంపతులపై దాడి చేయడంతో పాటు వృద్ధుడు అనుమానస్పదస్థితిలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అయితే అతడి మర్మంగాలు కోసేయడంతో గ్రామస్తులు హత్యగా పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం..
దేవరకొండ మండలం మడమడక గ్రామానికి చెందిన మన్యం రాములు(60), అంజమ్మ భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఇంటి పక్కనే మేడమోని మల్లయ్య కుటుంబం నివాసం ఉంటుంది. అయితే మల్లయ్య ఇల్లు ఎత్తుకు ఉండటంతో వారింటి మురుగు నీరు దిగువన ఉన్న మాన్యం రాములు ఇంట్లోకి వచ్చేవి. ఇదే విషయంపై గతంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదంతోపాటు ఘర్షణలు జరిగాయి. ఇటీవల వారిద్దరి ఇంటి మధ్యలో సీసీరోడ్డును నిర్మించడంతో మురుగు మొత్తం మాన్యం రాములు ఇంట్లోకే వస్తోంది. ఇదే విషయంపై గురువారం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన మేడమోని మల్లయ్య కుటుంబ సభ్యులు రాములును, ఆయన భార్యను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ దాడిలో రాములు భార్య అంజమ్మ పక్కటెములు విరిగాయి. వెంటనే ఆమెకు చికిత్స చేయించి అంజమ్మ తల్లిగారి ఊరైన చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో వదిలి పెట్టి వచ్చాడు.
రాత్రి సమయంలో మాడమాడకకు వచ్చిన రాములు తన ఇంటి ముందు మంచంపై పడుకున్నాడు. అయితే దళిత కుటుంబంపై దాడి చేయడంతో రాములు కేసు పెడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు అవుతుందని భయపడిన మేడమోని మల్లయ్య, మేడమోని సత్యమ్మ, మేడమోని బాలయ్య, మేడమోని లక్ష్మమ్మ కలిసి మాన్యం రాములు మర్మంగాలు కోసి హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే విషయాన్ని పేర్కొంటూ రాములు భార్య అంజమ్మ సైతం శుక్రవారం పోలీసులకు ఇచ్చిన పిటిషన్‌లో పేర్కొన్నది. అయితు శనివారం కొంతమంది పెద్దమనుషులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. అంజమ్మకు రూ.4.10 లక్షలు ఇచ్చి రాజీకుదిర్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా రాములు హత్యపై దేవరకొండ సీఐ కందనవోలు బిసన్న మాట్లాడుతూ ''మృతుడు మాన్యం రాములును మేడమోని మల్లయ్య కుటుంబ సభ్యులు కొట్టడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకున్నట్లు ఆయన భార్య అంజమ్మ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు'' . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.