అఫ్జల్ గంజ్‌లో దారుణం.. కరెంట్ షాక్‌తో జాతీయ పక్షి మృతి
దిశ ప్రతినిధి , హైదరాబాద్: విద్యుదాఘాతంతో జాతీయ పక్షి నెమలి మృతి చెందింది..latest telugu news
దిశ, ప్రతినిధి , హైదరాబాద్: విద్యుదాఘాతంతో జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. సకాలంలో ట్రాఫిక్ పోలీసులు గమనించి నెమలి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కోఠిలోని మహిళా కళాశాల పరిసర ప్రాంతాలలోని చెట్లపై ఉంటున్న నెమలి అర్ధరాత్రి సమయంలో గాలిలో ఎగురుతూ మూసీ నదివైపుగా వచ్చే క్రమంలో విద్యుత్ వైర్లు తాకి, కాలిన గాయాలతో కింద పడిపోయింది. సమీపంలో విధుల్లో ఉన్న సుల్తాన్ బజార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌లు కృష్ణ, శేషాద్రిలు గమనించి అఫ్జల్ గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు నెమలికి నీళ్లు త్రాగించి ప్రథమ చికిత్స అందించినా మృతి చెందింది. సమాచారం అందుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులు అక్కడికి చేరుకుని చనిపోయిన జాతీయ పక్షికి పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా రోడ్డుపై జాతీయ పక్షికి ట్రాఫిక్ పోలీసులు సేవ చేయడాన్ని గమనించి అటుగా వెళ్లేవారు వారిని అభినందించారు.