Kiran Abbavaram: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘క’.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టిందంటే? (ట్వీట్)

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’.

Update: 2024-11-15 15:21 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. సుజిత్, సందీప్(Sujith, Sandeep) సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి(Diwali) కానుకగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్(Collections) కూడా భారీగానే రాబడుతోంది. కేవలం తెలుగులోనే విడుదలైన ‘క’ ఊహించని రెస్సాన్స్‌ అందుకుంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టినట్లు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) వెల్లడించాడు.

విడుదలైన 15 రోజుల్లోనే రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘‘మనం చేసే మంచి చెడులు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక వీకెండ్స్‌కు ‘క’ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమా మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. అయితే దీనిని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) వేఫరర్ ఫిలింస్ బ్యానర్‌పై విడుదల చేయబోతున్నట్లు సమాచారం.


Click Here For Twitter Post..

Tags:    

Similar News