అదృశ్యమైన బాలుడు.. మూడే గంటల్లో కథ ముగించిన పోలీసులు..

దిశ, ముషీరాబాద్: తల్లి మందలించిందని 10 సంవత్సరాల బాలుడు- latest Telugu news

Update: 2022-03-15 16:37 GMT
అదృశ్యమైన బాలుడు.. మూడే గంటల్లో కథ ముగించిన పోలీసులు..
  • whatsapp icon

దిశ, ముషీరాబాద్: తల్లి మందలించిందని 10 సంవత్సరాల బాలుడు ఇంట్లోంచి బయటికు వెళ్లి అదృశ్యమైన కేసును చిక్కడపల్లి పోలీసులు మూడు గంటల్లోనే చేధించారు. కేసు వివరాలను సీఐ సంజయ్ కుమార్ వెల్లడించారు. దోమలగూడ గగన్ మహల్‌లో నివసించే నాందేవ్ కొడుకు అమిత్ ( 10 ) ఆరవ తరగతి చదువుతున్నాడు. అయితే, మంగళవారం ఉదయం తల్లి అమిత్‌ను మందలించింది. దీంతో అమిత్ అలిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దీనితో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. ఐదు బృందాలు రంగంలోకి దిగారు. హిమాయత్ నగర్ రోడ్డు మార్గంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. హిమాయత్ నగర్లో ఓ షోరూం వద్ద అమిత్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ కేసును కేవలం మూడు గంటల్లోనే చేధించేందుకు కానిస్టేబుల్స్ సంతోష్ కుమార్, రామాంజనేయ ప్రసాద్ తదితరులు కీలక పాత్ర పోషించారని అని సీఐ సంజయ్ కుమార్ అన్నారు.

Tags:    

Similar News